![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఇల్లు-ఇల్లాలు-పిల్లలు వెర్సెస్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ వాళ్ళు వచ్చారు. ఇక ప్రభాకర ఆమనితో ముచ్చట్లు పెట్టింది శ్రీముఖి. "ఎలా ఉన్నారు రామరాజు గారు" అని అడిగింది. "మీరు ఎలా ఉంటారు అనుకున్నాను. చూస్తే మా వైఫ్ లో బుజ్జమ్మను చూసినట్టే ఉన్నారు" అని చెప్పాడు ప్రభాకర్. "బుజ్జమ్మ గారు సెట్ లో కూడా ఇంతే రొమాంటిక్ గా ఉంటారా ఏంటి" అంటూ ఆమనిని అడిగింది. "ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారు" అని చెప్పింది. ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుంచి వచ్చిన హీరో బాలు శ్రీముఖికి ఒక కంప్లైంట్ చేసాడు. "వీడికి ఎంత కస్టపడి ఫర్నిచర్ షాప్ పెట్టిస్తే షాప్ ఓనర్ లా రావాలి కానీ వీడేమో మెకానిక్ షాప్ ఓనర్ లా వచ్చాడు." అంటూ సీరియల్ లో తన తమ్ముడు మనోజ్ గురించి చెప్పుకొచ్చాడు.
ఇక మనోజ్ ఐతే తానూ వేసుకొచ్చిన బ్లూ కలర్ డ్రెస్ ని కింద నుంచి పై వరకు చూసుకుని కొంచెం ఫీలయ్యాడు. దాంతో సెట్ లో ఉన్నవాళ్ళంతా నవ్వేశారు. ఇక సీరియల్ లోని మీనా గురించి రెండు లైన్స్ చెప్పాడు హరి.."అందరి మీద పడుతుంది వానా. అందరి మనస్సులో ఉంటుంది మీనా" అనేసరికి "అబ్బో" అంటూ అరిచింది శ్రీముఖి. "బలం కావాలంటే తాగాలి పాలు...కానీ నాకు బలం రావాలంటే కావాలి బాలు" అంటూ శ్రీముఖి మంచి జోష్ తో చెప్పింది. ఇక నెటిజన్స్ ఐతే ఈ షోలో బాలును చూసినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. "బాలు నీ షో లో చూసి చాలా రోజులు అవుతుంది , బాలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.బాలు కోసం ఈ వీక్ షో కచ్చితంగా చూడాల్సిందే." అంటూ కామెంట్ చేశారు.
![]() |
![]() |